నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి గురించి నివేదించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల స్టాల్స్‌ను తిలకించారు. మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటింటా అంకురాలు ప్రజలకు ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయి శంకర్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను తిలకించారు.
నాగర్‌కర్నూల్ ఘనంగా పంద్రాగస్టు వేడుకలు - nagakurnool
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు.
![నాగర్‌కర్నూల్ ఘనంగా పంద్రాగస్టు వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4144976-thumbnail-3x2-df.jpg)
పంద్రాగస్టు వేడుకలు