తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. మినీ ట్యాంక్​పై అక్రమ కట్టడాలకు కళ్లెం - ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. మినీ ట్యాంక్​పై అక్రమ కట్టడాలకు కళ్లెం

ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం నాగర్​కర్నూల్​ జిల్లా కేసరి సముద్రం బఫర్​జోన్​ పరిధిలోని అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఆక్రమణకు గురైన భూముల అనుమతులను రద్దు చేస్తూ భూ యజమానులకు జిల్లాపాలనాధికారి నోటీసులు జారీ చేశారు.

illegal building constructions are ceased by collector in nagarkarnool
ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. మినీ ట్యాంక్​పై అక్రమ కట్టడాలకు కళ్లెం

By

Published : Jan 5, 2020, 9:34 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రంలో ఆక్రమణలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం స్పందించింది. కేసరి సముద్రం మినీ ట్యాంక్​బండ్ ఆక్రమణలపై గత నెల డిసెంబర్ 20న "భూ దాహం చెరువులు మాయం" అని 'ఈటీవీ భారత్' ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించారు.
కేసరి సముద్రం బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్న సుమారు ఏడు ఎకరాల భూములకు గత ఆర్డీవో ఇచ్చిన వ్యవసాయేతర భూముల అనుమతులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ రద్దు చేశారు. నాలా అనుమతులను రద్దు చేస్తూ... భూ యజమానులకు నోటీసులు జారీ చేశారు.

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​.. మినీ ట్యాంక్​పై అక్రమ కట్టడాలకు కళ్లెం
నాలా అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా ఇస్తే వాటిని రద్దు చేసే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. బఫర్ జోన్​లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని.. నిబంధనలను నోటీసుల్లో కలెక్టర్​ పేర్కొన్నారు. వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా భూ యజమానులకు నోటీసులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details