విలీనం తెచ్చిన కష్టం - villagers problems
ఏ గ్రామమైనా పురపాలక సంఘంలో విలీనమైతే అభివృద్ధి జరుగుతుందని భావిస్తాం. కానీ అచ్చంపేటలోని 8 గ్రామాల పరిస్థితి పూర్తి భిన్నం. అధికారుల నిర్లక్ష్యం, నాయకుల అలసత్వం వెరసి ఆయా గ్రామాలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి.
ఉపాధి హామీ పోయింది ఇప్పటికే ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసినప్పటికీ.. అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. సరైన రహదారి సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మున్సిపాలిటీగా మారడం వల్ల ఉపాధి పనులు ఆగిపోయి పని కరువైంది. పారిశుద్ధ్య సమస్య తీవ్రమైంది. ప్రతి చిన్న పనికీ అచ్చంపేట వెళ్లాల్సి వస్తుందని.. తమ సమస్యలను అధికారులకు విన్నవించడానికి ప్రయత్నించినా వారు అందుబాటులో ఉండరని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి తమ గ్రామాలను మునిపటిలా పంచాయతీలుగానే మార్చాలని 8 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.