నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి, పంచమ శివకల్యాణ మహోత్సవం నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా మొదటిరోజు మహిళలతో శ్రీలక్ష్మి హరిహర దేవ హోమము నిర్వహించారు. స్వామి దయానంద గిరి ఆధ్వర్యంలో సప్త మహా నదుల పవిత్ర జలముతో మహాభిషేకము, లక్ష తమలపాకులతో అర్చన హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మన్ శ్రీశైలం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో పంచమ శివ కల్యాణ మహోత్సం - klky
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శ్రీ హనుమాన్ జయంతి, పంచమ శివ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పంచమ శివ కల్యాణ మహోత్సం