సినీ హీరో నితిన్ నాగర్ కర్నూల్ జిల్లాకు అల్లుడు కాబోతున్నాడు. పట్టణంలోని ప్రగతి నర్సింగ్ హోం నిర్వాహకులు, ప్రముఖ వైద్యులు నూర్జహాన్, సంపత్‌కుమార్‌ల కుమార్తె శాలినిని నితిన్ వివాహం చేసుకోనున్నాడు. హైదరాబాద్‌లో శాలిని బీటెక్ పూర్తిచేసింది. నాలుగేళ్ల క్రితం వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.
హీరో నితిన్ లగ్గమాడబోయే పిల్లదెక్కడో తెలుసా? - హీరో నితిన్ నిశ్చితార్థం వార్తలు
సినీ హీరో నితిన్.. నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్ హోం నిర్వాహకులైన నూర్జహాన్ కుమార్తెను వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరిద్దరికీ నిశ్చితార్థం జరగగా.. తమ జిల్లాకు నితిన్ అల్లుడు కాబోతున్నాడని ప్రజలు సంతోషంగా ఉన్నారు.
నాగర్‌కర్నూలు జిల్లాకు అల్లుడు కాబోతున్న నితిన్
ఏప్రిల్ 16న దుబాయిలోని ఓ హోటల్లో సన్నిహితులు, బంధువుల మధ్య వివాహం జరగనున్నట్లు సమాచారం. శాలిని తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా కావలిలోని దుత్తలూరుకు చెందిన వారు. వీరిద్దరూ కర్నూల్లో వైద్య విద్య పూర్తిచేసి... 1991లో నాగర్‌కర్నూల్‌కు వచ్చి స్థిరపడ్డారు.
ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా
Last Updated : Feb 16, 2020, 12:57 PM IST