నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం సంతతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, పురపాలక శాఖ వారు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రజల్లో మార్పు కనబడటం లేదు. పోలీసులు లాక్డౌన్ను (Lockdown) పకడ్బందీగా అమలు చేస్తున్నా... ప్రజలు సడలింపు సమయంలో రోడ్ల మీదకు వస్తున్నారు. ఎక్కువ మంది ఉదయం 8 తర్వాతే వచ్చి నిత్యావసర సరుకులు కొనడం లేదా ఇతర పనులు చేసుకుంటున్నారు.
Lockdown: లాక్డౌన్ సడలింపు సమయంలో రద్దీగా రోడ్లు - అచ్చంపేటలో రద్దీగా మారిన రోడ్లు
లాక్డౌన్ (Lockdown) మినహాయింపు వేళ అచ్చంపేటలోని పలు ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఆదివారం సంతతో మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందరూ ఒకేసారి బయటకు వస్తుండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
లాక్డౌన్ సడలింపు సమయంలో రద్దీగా రోడ్లు
అందరూ ఒకేసారి బయటకు వస్తుండటం వల్ల పలు చోట్ల రద్దీ నెలకొంటోంది. ప్రజలు ఉదయం పూట భారీగా వస్తుండటం వల్ల అచ్చంపేటలోని అంబేద్కర్, లింగాల, ఉప్పునుంతల కూడళ్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
ఇదీ చదవండి :Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి