నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఫలితంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో కొన్నిచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. మరికొన్ని చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి.
పెంట్లవెళ్లి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి మండలాల్లో చెరువులు, వాగులు నిండి జలకళ సంతరించుకున్నాయి. వర్షం ధాటికి వీపనగండ్ల మండల కేంద్రంలో ఓ ఇల్లు కూలిపోయింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.