నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు చెరువు నిండి అలుగుపారుతోంది. దీంతో కల్వకుర్తి-తెలకపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుందుభి వాగు పొంగి మొగర్ల-అల్పర మధ్య అచ్చంపేట కల్వకుర్తి మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
పొంగుతున్న వాగులు... నిలిచిన రాకపోకలు - నాగర్ కర్నూల్ వార్తలు
మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగర్కర్నూల్ జిల్లాలో చెరువులు అలుగుపారుతున్నాయి. వాగులు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పొంగుతున్న వాగులు... నిలిచిన రాకపోకలు
ఉప్పునూతల వద్ద 3 ట్రాక్టర్లు దుందుభి వాగులో చిక్కుకుపోయాయి. కొల్లాపూర్లోని ముక్కిడిగుండం, ఉడుములవాగు, నార్లాపూర్ పెద్దవాగు పొంగుతోంది. రోడ్డు కోతకు గురై... పక్కనే ఉన్న వరి, మామిడి తోటలో నీరు నిండుగా చేరుకుంది. కోడెరు మండలంలోని పసుపుల వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.