నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సంచార పాతోలాజికల్ లేబోరేటరీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉప్పునుంతలలోని ప్రభుత్వ ఆస్పత్రి అప్గ్రేడ్ పనులకు శంకుస్థాపన చేశారు.
'త్వరలోనే అచ్చంపేటలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం' - ఉప్పునుంతలలో మంత్రి ఈటల పర్యటన
రాష్టవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తామని, అవసరమైన వసతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
!['త్వరలోనే అచ్చంపేటలో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం' minister etela visit to uppununthala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6093860-thumbnail-3x2-a.jpg)
ఉప్పునుంతలలో మంత్రి ఈటల పర్యటన
ఉప్పునుంతలలో మంత్రి ఈటల పర్యటన
మారుమూల ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుని ఉప్పునుంతల ఆస్పత్రిని 30 పడకల హాస్పిటల్గా మరో 8 మాసాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి ఈటల తెలిపారు. త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
గతంతో పోలిస్తే రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని మంత్రి పేర్కొన్నారు. పేదల కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను పూర్తిస్థాయిలో పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు.
- ఇవీ చూడండి:50 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత