తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేయాలి: ఎంపీ రాములు - కల్వకుర్తి మండలంలో హరితహారం

గ్రామాల అభివృద్ధికి పార్టీలు, రాజకీయాలకతీతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని నాగర్​కర్నూల్​ ఎంపీ రాములు అన్నారు. కల్వకుర్తి మండలంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

haritaharam program at kalwakurthy mandal nagarkurnool district
గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేయాలి: ఎంపీ రాములు

By

Published : Aug 6, 2020, 7:49 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని.. ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు కావాలని నాగర్​కర్నూలు ఎంపీ రాములు కోరారు. కల్వకుర్తి మండలంలోని పంజుగుల, గుండూరు, లింగసానిపల్లి, రఘుపతిపేట గ్రామాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాటిన మొక్కలు.. వృక్షాలుగా మరే వరకు బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలు, రాజకీయాలకతీతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.

ఇవీచూడండి:ఏపీ రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోదే: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details