తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటా: విప్​ బాలరాజు - ప్రజల కష్ట సుఖాలలో తోడుంటా

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కష్ట సుఖాల్లో తోడుంటానని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు తెలిపారు. లింగాల మండల కేంద్రంలో బుద్ధవనం గార్డెన్​ను ప్రారంభించారు.

Guvala balaraju Inauguration to open gym at lingala mandal in Nagarkarnool district
ప్రజల కష్ట సుఖాలలో తోడుంటాప్రజల కష్ట సుఖాలలో తోడుంటా

By

Published : Jul 12, 2020, 10:30 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా లింగాలలో బుద్ధవనం గార్డెన్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ పార్క్​ను అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. పురాతన చరిత్ర గల సబ్​ జైలును పార్కుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన సర్పంచ్ కోనేటి తిరుపతయ్యను అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి జిమ్​లో కాసేపు వ్యాయామం చేశారు.

ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం కోసం ఓపెన్ జిమ్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కష్ట సుఖాల్లో తోడుంటానని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details