తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్ ఇండియాతో పర్యావరణ పరిరక్షణ : కలెక్టర్​

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలుగుతుందని నాగర్ కర్నూల్​ జిల్లా పాలనాధికారి శర్మన్​ అన్నారు. జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం ఆదిరాల గ్రామంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈ రమేశ్​తో కలిసి మొక్కలు నాటారు.

Green india challenge by nagar kurnool collector today
గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటుతున్న కలెక్టర్​ శర్మన్​

By

Published : Feb 17, 2021, 10:33 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ మొక్క‌లు నాటారు. ఈరోజు పెద్దకొత్తపల్లి మండలం ఆదిరాల గ్రామంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈ రమేశ్​తో కలిసి రోడ్డు పక్కన మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తుందన్నారు. హరితహారానికి మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంద‌ని తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటే విధంగా కృషి చేస్తాన‌ని కలెక్టర్ శర్మన్​​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కేసీఆర్​ జననం.. తెలంగాణ ప్రజలకు వరం: గంగుల

ABOUT THE AUTHOR

...view details