తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవం - ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియా ఆస్పత్రిలోని రోగులకు, పట్టణ ప్రజలకు 36 వేల బత్తాయి పండ్లను పంపిణీ చేశారు శ్రీ సత్యసాయి సేవా సమితి వారు.

ORANGES DISTRIBUTION IN NAGAR KURNOO;
ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవం

By

Published : Apr 24, 2020, 7:10 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా భక్తులెవరినీ లోపలికి రానివ్వకుండా కన్వీనర్ చేతుల మీదుగా స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేయించారు.

ఇందులో భాగంగానే ఆస్పత్రికి వెళ్లి రోగులకు, రోగి సహాయకులకు, గర్భిణీలకు, వైద్య-ఆరోగ్య సిబ్బందికి బత్తాయి పండ్లు అందజేశారు. పట్టణంలోని 24 వార్డుల్లో ప్రజలకు 36,000 వేళ బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హకీం విశ్వ ప్రసాద్ తెలిపారు.

ఇవీ చూడండి:ఉపవాస దీక్షకు దిగిన బండి సంజయ్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details