తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: ప్రశాంత్ రెడ్డి - Nagar Kurnool District Latest News

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పట్టభద్రుల ఎన్నికల తెరాస విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.

Graduate Election Trs meeting was held at Kalvakurthi
కల్వకుర్తిలో పట్టబద్రుల ఎన్నికల తెరాస సమావేశం

By

Published : Mar 4, 2021, 8:55 PM IST

పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీ దేవిని గెలిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన తెరాస ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీ దేవి.. కల్వకుర్తి మండలానికి చెందిన ఆడబిడ్డ అని.. కాబట్టి ఆమె గెలుపుకు కృషి చేయాలన్నారు.

ఉద్యోగులకు తెరాస ప్రభుత్వం ఇస్తున్న అధిక వేతనాలు.. భాజపా పాలిత రాష్ట్రల్లో చెల్లించడం లేదని గుర్తు చేశారు. ఒక్క దుబ్బాకలో గెలువటంతో వారికి అహం పెరిగిందని విమర్శించారు. అహంకారం తగ్గాలంటే తెరాస అభ్యర్థి వాణీ దేవిని గెలిపించాలని కోరారు.

ఇతర పార్టీల వారికి బుద్ధి చెప్పాలని తెలిపారు. అందరు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఎంపీపీ సునీత, తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయండి: తీగుల్ల పద్మారావు గౌడ్​

ABOUT THE AUTHOR

...view details