తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tour: నేడు నాగర్​కర్నూల్​ జిల్లాకు గవర్నర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు నాగర్​ కర్నూల్​ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలను ఆమె సందర్శించనున్నారు. ఆ ప్రాంతాలోని చెంచుగూడెంలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Governor Tour
నేడు నాగర్​కర్నూల్​ జిల్లాకు గవర్నర్

By

Published : Mar 26, 2022, 4:47 AM IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఇవాళ పర్యటించున్నారు. నల్లమల పరిధిలోని ఉండే చెంచుగూడెంలను ఆమె సందర్శించనున్నారు. అప్పాపూర్​కు చేరుకుని సమీపంలో ఉన్న 6 చెంచుగూడెంలకు చెందిన గిరిజనులతో సమావేశమవనున్నారు. ఆరోగ్య ఉప కేంద్రం, టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఆశ్రమ పాఠశాలను గవర్నర్ పరిశీలిస్తారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అప్పాపూర్, బౌరాపూర్ సర్పంచ్‌లకు ద్విచక్ర అంబులెన్స్‌లను అందజేయనున్నారు. అప్పాపూర్ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున దర్శించుకునేందుకు వెళ్లనున్నారు.

గవర్నర్‌ పర్యటన షెడ్యూల్

హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన ముందుగా నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూర్‌కు చేరుకోనున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుపై అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాల ప్రదర్శనను వీక్షించనున్నారు. అక్కడి నుంచి నల్లమలలోని ఉన్న అప్పాపూర్‌ గూడెంకు చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రం, టైలరింగ్‌ కేంద్రం, ఆశ్రమ పాఠశాలను పరిశీలించనున్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన 3కేవి సోలార్‌ పంప్‌ను ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా చెంచుల ఆరాధ్య దేవాలయం, నివాస గుడిసెలను సందర్శించి పాఠశాల విద్యార్థులతో సంభాషించనున్నారు. అనంతరం సభలో పాల్గొని గవర్నర్‌ ప్రసంగించనున్నారు. అడవుల్లో నివసించే చెంచు కుటుంబాలకు హెల్త్‌కిట్లు, యువతకు స్టడీ మెటీరియల్‌, అప్పాపూర్‌, బైరాపూర్ సర్పంచులకు మోటర్‌సైకిల్‌ అంబులెన్స్‌లను అందజేయనున్నారు. తిరిగి మన్ననూర్‌ అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకోనున్నారు. మధ్యాహ్నం తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రానికి ఈదే మార్గాన తిరిగి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు.

ఇదీ చూడండి:

GOVERNOR TAMILISAI: తెలంగాణ ఫార్మా పరిశ్రమకు హబ్‌గా మారింది: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details