తెలంగాణ

telangana

ETV Bharat / state

అచ్చంపేట ప్రజలకు రుణపడి ఉంటా: గువ్వల బాలరాజు - nagar kurnool district latest news

అచ్చంపేట పుర ఛైర్మన్ పీఠాన్ని తెరాసకు అందించినందుకు ప్రజలకు రుణపడి ఉంటానని... ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారని... దాని వల్లే ప్రతిపక్షాలు 7 వార్డుల్లో విజయం సాధించారని ఆయన తెలిపారు.

Trs victory in Achampet municipality election
అచ్చంపేట పురపాలికలో తెరాస విజయంపై ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు హర్షం

By

Published : May 3, 2021, 6:02 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలికలో తెరాసను గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటానని... ప్రభుత్వం విప్ గువ్వల బాలరాజు తెలిపారు. గత ఎన్నికల కన్నా ఈసారి సీట్లు తగ్గడం ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు పనిగట్టుకొని తమ పార్టీపై దుష్ప్రచారం చేయడం వల్ల కొన్ని సీట్లు తగ్గాయన్నారు.

పట్టణంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నందున ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. దాని వల్లే ప్రతిపక్షాలు 7 వార్డుల్లో విజయం సాధించారని చెప్పారు. పట్టణ అభివృద్ధిలో ఎలాంటి వివక్ష చూపకుండా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు. పుర ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: లైవ్​ అప్​డేట్స్​: గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్​లో తెరాస ఆధిక్యం

ABOUT THE AUTHOR

...view details