నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. మన్ననూర్లోని బాలికల రెసిడెన్షియల్ భవనంలో అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో 50 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు - నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు
అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు.
ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
మారుమూల నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటున్న కరోనా బాధితుల కోసం అపోలో యాజమాన్యం ఇక్కడ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం స్పూర్తిదాయకమని ప్రభుత్వ విప్ తెలిపారు. కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఏ విధమైన అవసరం ఉన్నా జిల్లా వైద్యాధికారి లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా