భూతగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకే కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రారంభించిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి ఆయన ధరణి పోర్టల్‌ను పరిశీలించారు. అనంతరం ఓ లబ్ధిదారునికి పట్టా పుస్తకాన్ని అందజేశారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డుల ప్రక్షాళన చేసి చాలావరకు సమస్యలను పరిష్కరించారని తెలిపారు.
ధరణి పోర్టల్‌తో భూతగాదాలు పరిష్కారం: ప్రభుత్వ విప్ బాలరాజు - nagarkurnool district news
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ధరణి పోర్టల్‌ను పరిశీలించారు. భూతగాదాలను పరిష్కరించేందుకే సర్కారు ధరణి పోర్టల్‌ను ప్రారంభించిందని ఆయన తెలిపారు.
ధరణి పోర్టల్‌తో భూతగాదాలు పరిష్కారం: ప్రభుత్వ విప్ బాలరాజు
సమస్యలు పూర్తిగా పరిష్కరించాలనే ఉద్దేశంతో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతోపాటు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని చెప్పారు. దీనిద్వారా పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం అరగంట లోపులో పట్టా పుస్తకాలు అందుకునే అవకాశం కల్పించారని ఆయన అన్నారు. రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన చెప్పారు. అనంతరం లింగాల, బల్మూర్ మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఇవీ చూడండి: తాత్కాలిక అవసరాల నిమిత్తం నిధుల విడుదల: నిరంజన్‌రెడ్డి