నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, నాగర్‌కర్నూల్ పార్లమెంటు ఇంఛార్జి బంగారు శృతి ముఖ్యఅతిథుగా హాజరై యాత్ర ప్రారంభించారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకే ఈ యాత్ర ప్రారంభించినట్లు ఆచారి తెలిపారు. ఈ యాత్ర పార్లమెంటు నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల మేర కొనసాగనుందన్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు.
కల్వకుర్తిలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభం - thalloju achari in kalwakurhty gandhi sankalpa yathra
మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం సందర్భంగా... కల్వకుర్తిలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ భాజపా ఇంఛార్జి బంగారు శృతి హాజరయ్యారు.
కల్వకుర్తిలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభం