తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగు నీటికోసం రోడ్డెక్కిన రైతులు - formers-strikes-at-nagarkarnool

సాగునీటి కోసం రాష్ట్రంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాగర్​కర్నూల్ జిల్లాలో అన్నదాతలు పండించిన పంటలు నీళ్లు లేక ఎండిపోవటంతో వారికి సాగునీటిని కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలను నింపాలని రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.

నాగర్​కర్నూల్​లో రైతుల రాస్తారోకో

By

Published : Apr 15, 2019, 10:10 AM IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా చేగుంట గ్రామం వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సాగునీరు చెరువులు కుంటలు నింపాలని చేగుంట, గోరింట, వెల్కిచర్ల గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. తిమ్మాజీపేట మండలంలోని వెల్కిచర్ల చేగుంట గ్రామంలోని సుమారు పదిహేను కుంటలు, చెరువులు నింపితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా అధికారులకు నాయకులకు చెప్పినా ఎవరూ పట్టించుకో లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లాభం లేదని ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వంటావార్పు చేశారు. ధర్నాతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

నాగర్​కర్నూల్​లో రైతుల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details