తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం' - మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాప సభ వార్తలు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాప సభను నిర్వహించారు. పలువురు నేతలు హాజరై.. సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.

Former MLA Kishtareddy's services memorable
'మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయం'

By

Published : Sep 12, 2020, 10:02 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో కేఎల్ఐ జల సాధన సమితి, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కల్వకుర్తి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాప సభను నిర్వహించారు. కార్యక్రమానికి జానపద గాయకుడు గోరేటి వెంకన్న, సీఎల్పీ నాయకుడు, హైకోర్టు న్యాయవాది రఘునాథ్, సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లే గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. మానవ విలువలు కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల కోసం, రైతుల కోసం ఎంతగానో శ్రమించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి కన్వీనర్ లక్ష్మణ శర్మ, పురపాలిక సంఘం అధ్యక్షుడు ఎడ్మ సత్యం, సభ్యులు లింగం గౌడ్, సర్దార్ నాయక్, భీమయ్య, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details