తెలంగాణ

telangana

ETV Bharat / state

'గార్బేజ్​ రిమూవింగ్​ సైకిల్ బోట్'​తో అచ్చంపేట విద్యార్థికి ప్రథమ స్థానం

రాష్ట్ర స్థాయిలో ఆన్​లైన్ వేదికగా నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో నాగర్​ కర్నూల్​ జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. పోటీలో ప్రథమస్థానంలో నిలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. పర్యావరణ హితం అనే అంశంపై చేపట్టిన వినూత్న ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

first prize for garbage removing cycle boat
గార్బేజ్ రిమూవింగ్ సైకిల్ బోట్

By

Published : May 5, 2021, 1:10 PM IST

రాష్ట్ర స్థాయి ఆన్​లైన్ వైజ్ఞానిక ప్రదర్శనలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సాయికృష్ణ ప్రథమ స్థానం సాధించాడు. రాష్ట్రస్థాయి 49వ జవహర్​లాల్​ నెహ్రూ సైన్స్​, గణితం, పర్యావరణం సంబంధిత అంశాలపై ఏప్రిల్​ 9న నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు.

'పర్యావరణ హిత సమాజ సృష్టిలో సాంకేతిక విప్లవం' అనే ఉప అంశానికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. స్థానిక జలాశయాల్లో పేరుకొని తేలాడే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి తయారుచేసిన 'గార్బేజ్ రిమూవింగ్ సైకిల్ బోట్' ప్రదర్శన ఆకట్టుకుంది.

విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆన్​లైన్​ వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికలుగా నిలిచాయని, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అభిప్రాయపడ్డారు. ప్రథమ స్థానంలో ఎంపికైన విద్యార్థి, గైడ్ టీచర్​ను గోవింద రాజులు, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి ఫోన్​ చేసి అభినందించారు.

ఇదీ చదవండి:ప్రైవేటు ఆస్పత్రుల దౌర్జన్యం... లక్షల్లో వసూలు

ABOUT THE AUTHOR

...view details