తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు - Telangana news

నల్లమలలో మరోసారి మంటలు చెలరేగాయి. నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలో మరోసారి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు
నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు

By

Published : Mar 20, 2021, 2:34 AM IST

Updated : Mar 20, 2021, 2:40 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలో మరోసారి మంటలు చెలరేగాయి. మండలంలోని తుర్కపల్లి సెక్షన్ పరిధిలో ఈర్లపడేలు, రోళ్లబండ ప్రాంతంలో సాయంత్రం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

సుమారుగా పది హెక్టార్ల విస్తీర్ణంలో అడవి అగ్నికి ఆహుతైంది. ఇరవై మంది అటవీశాఖ సిబ్బందితో కలిసి రాత్రి 8గంటల వరకు మంటలను అదుపులోకి తెచ్చామని అమ్రాబాద్ అటవీ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు.

నల్లమలలో చెలరేగిన మంటలు

ఇదీ చూడండి :82 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

Last Updated : Mar 20, 2021, 2:40 AM IST

ABOUT THE AUTHOR

...view details