నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఎక్కువగా విద్యుదాఘాతం, గ్యాస్ సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదాలు జరగటం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓ వ్యక్తి అగ్నిప్రమాదానికి గురైనప్పుడు, ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను వివరించారు. ప్రధానంగా ఎలాంటి అగ్నిప్రమాదమో గుర్తించాలని సూచించారు. అనంతరం 100, 108కు తప్పనిసరిగా సమాచారం అందించాలని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.
అగ్నిప్రమాదాల్లో జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన... - FIRE SAFETY AWARENESS PROGRAM AT KALWAKURTHI COLLEGE
అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలను అరికట్టటం ఎలా, ప్రమాద సమయంలో వ్యక్తులను రక్షించటం లాంటి అంశాలు వివరించారు.
FIRE SAFETY AWARENESS PROGRAM AT KALWAKURTHI COLLEGE