నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరుడు మల్లయ్య, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు నయీమ్ పాషాలు పరస్పరం దాడి చేసుకున్నారు. శాలి అనే వ్యక్తికి చెందిన పాత ఇంటి నుంచి పాములు వస్తున్నాయని గౌస్ పాషా అనే వ్యక్తి మున్సిపాలిటీలో ఫిర్యాదు చేశారు.
పట్టణ ప్రగతిలో ఇరువర్గాల ఘర్షణ - Nagar karnul News
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాడుబడిన ఇళ్లను కూల్చే క్రమంలో మధ్య మాట మాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఇంటి యజమాని ఒప్పందంతో పాడుబడిన ఇంటని కూల్చే క్రమంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన మల్లయ్య అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి పరస్ఫరం దాడులు చేసుకున్నారు. కౌన్సిలర్‌గా గెలిచిన నాకు తెలియకుండా నా వార్డులో ఓడిపోయిన వ్యక్తి పనులు ఎలా చేయిస్తారంటూ నయీమ్ పాషా జేసీబీ ముందు అర్ధనగ్నంగా పడుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు కౌన్సిలర్ నయీమ్ పాషాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల దాడిలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన మల్లయ్య చేతికి, మొఖానికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రెండు వర్గాల వారు పరస్పంర ఫిర్యాదులు చేసుకున్నారు.
ఇదీచూడండి :40 మంది విద్యార్థులపై కత్తితో దాడి