గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోవధను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1న హైదరాబాద్లో జరగనున్న గో మహాగర్జన కార్యక్రమానికి నేడు సన్నాహక సమావేశం నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో ఆవు ప్రాముఖ్యతను వివరించారు.
'గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.. గోవధ ఆపాలి' - తెలంగాణ వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతిలో గోవు ప్రాధాన్యాన్ని వివరించారు. ఏప్రిల్ 1న హైదరాబాద్లో జరగనున్న గో మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
'గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి.. గోవధ ఆపాలి'
గో ఆధారిత సేద్యం, ఆవు వల్ల కలిగే లాభాలను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్, డాక్టర్ సురేఖ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:'గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే సూర్యాపేట గ్యాలరీ ప్రమాదం'