తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ప్రారంభమైన ఫీవర్​ సర్వే - ఫీవర్​ సర్వే వార్తలు

నాగర్ కర్నూలు జిల్లాలో జిల్లాలో కొవిడ్​ కేసులు భారీగా పెరగడంపై సీఎం కేసీఆర్​ స్వయంగా స్పందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణమే ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని వైద్యులు, వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటిటి ఫీవర్​ సర్వే నిర్వహిస్తున్నారు.

Telangana news
ఫీవర్​ సర్వే

By

Published : May 23, 2021, 8:45 PM IST

నాగర్​ కర్నూలు జిల్లాలో కొవిడ్​ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. వైరస్​ను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్​ సూచనతో జిల్లాలో ఫీవర్​ సర్వే ప్రారంభించారు. గ్రామాల్లో ఐదు రోజులపాటు సర్వే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

జ్వర పీడితులు ఎంతమంది, జలుబు, దగ్గుతో ఎంతమంది, ఇతర వ్యాధులతో ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి రిపోర్టును కలెక్టర్​కు సమర్పించనున్నారు. ప్రతి ఇంటికీ తిరిగి అవసరమైన వారికి మందులు అందించనున్నారు. సర్వేను జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు పర్యవేక్షించనున్నారు.

ఇదీ చూడండి:కేంద్రం వల్లే వ్యాక్సినేషన్​ జాప్యం : మంత్రి హరీశ్

ABOUT THE AUTHOR

...view details