నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు రాస్తారోకో చేపట్టారు. అన్నదాతలకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. రైతులు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడం కోసం మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అన్లైన్లో నమోదు కాలేదంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
మెుక్కజొన్న కొనుగోలు చేయడం లేదని రోడ్డెక్కిన రైతన్న
మెుక్కజొన్న కొనుగోలు చేయడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ ఎదుట బైఠాయించారు. అన్నదాతలకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తప్పించారు.
మెుక్కజొన్న కొనుగోలు చేయడం లేదని రోడ్డెక్కిన రైతన్న
ఆన్లైన్కు సంబంధం లేకుండా మొక్కజొన్న కొనుగోలు చేయాలని రోడ్డుపై 3గంటల పాటు ఆందోళన చేపట్టారు. అధికారులు వచ్చి కొనుగోలు చేస్తామని చెప్పే వరకు ఆందోళన విరమించమంటూ కూర్చున్నారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అన్నదాతలు, కాంగ్రెస్ నాయకులను బలవంతంగా పక్కకు తప్పించారు.
ఇదీ చదవండి:ధాన్యం టోకెన్ల జారీలో గందరగోళం..