తెలంగాణ

telangana

ETV Bharat / state

'మూడేళ్లయినా పరిహారం చెల్లించలేదు... మేమెలా బతకాలి?'

డిండి ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి దిగారు. మూడేళ్ల కింద డీఎల్ఐ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి ఇంతవరకు పరిహారం ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

farmers-protest-for-compensation-of-dindi-project-at-dindi-in-nagarkurnool-district
'మూడేళ్లయినా పరిహారం చెల్లించలేదు... మేమెలా బతకాలి?'

By

Published : Jan 4, 2021, 11:23 AM IST

డిండి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన తమకు ఇంకా పరిహారం చెల్లించలేదని భాజపా నాయకులతో కలిసి రైతులు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా డీఎల్ఐ (డిండి లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి మూడేళ్లు దాటినా రైతులకు పరిహారం చెల్లించలేదని... తామెలా బతకాలని గాజర, తిమ్మాపూర్, దిండి చింతపల్లి గ్రామాల రైతులు కాల్వ నీటిలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకముందే ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు చెప్పినా వినకుండా బలవంతంగా కాలువ పనులను ప్రారంభించారని రైతులు ఆరోపించారు.

తమకు పరిహారం చెల్లించకపోతే ఆత్మహత్యలే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిహారం పెంపు ఊసే ఎత్తడం లేదని వాపోయారు. సీఎం కేసీఆర్ స్పందించి భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:విందులో ఉన్న వరుడు.. పెళ్లిలో మాయం

ABOUT THE AUTHOR

...view details