తెలంగాణ

telangana

ETV Bharat / state

'సాగునీరందించి.. తమను ఆదుకోవాలి' - నాగర్​ కర్నూల్​ జిల్లా తాజా వార్త

నాగర్​కర్నూలు జిల్లా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జొన్నలగడ్డ రిజర్వాయిర్​కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. నీరులేక పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

farmers protest at satapur mahatma gandhi kalwakurthy ethipothala project in nagarkurnool district
'సాగునీరందించి.. తమను ఆదుకోవాలి'

By

Published : Nov 5, 2020, 3:08 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్​లోని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని నమ్ముకుని వేరుశనగ, పెసర, మినుము, కందులు ఇతర వాణిజ్య పంటలు, మామిడి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. కాగా ఇప్పడు జొన్నలగడ్డ రిజర్వాయర్​కు నీటిని విడుదల చేయకపోవడం వల్ల పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్షలు పెట్టుబడి పెట్టి వేసిన పంటను రక్షించుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పంటలకు నీళ్లు ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు నష్టం జరుగకుండా ఉండాలంటే వెంటనే రిజర్వాయర్​లో ఉన్న నీళ్లను కాలువలకు విడుదల చేసి ఎండిపోతున్న పంటకు నీళ్ల అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రేపటి వరకు సాగునీరు అందించకపోతే ప్రాజెక్ట్ వద్దే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:రైతు సమస్యల పరిష్కారానికై ఈ పోర్టల్​: ఎమ్మార్వో

ABOUT THE AUTHOR

...view details