తెలంగాణ

telangana

ETV Bharat / state

సన్నరకం ధాన్యం కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై భైఠాయించి ధర్నా చేశారు.

Telangana news
నాగర్​ కర్నూలు వార్తలు

By

Published : Jun 9, 2021, 7:53 PM IST

కొనుగోలు కేంద్రాల వద్ద కేవలం లావు రకం వరి ధాన్యాన్ని మాత్రమే కొంటున్నారని రైతులు ధర్నాకు దిగారు. నాగర్​ కర్నూల్​ జిల్లా లింగాల మండల కేంద్రం వద్ద రోడ్డుపై భైఠాయించి ఆందోళన తెలిపారు. ధాన్యం తూకం వేసి నెల రోజులు దాటినా పంటను తరలించకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల ధాన్యం వర్షాలకు తడిసి మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సూచనలపై సన్నాలు పండిస్తే ఇప్పుడు వాటిని అమ్ముకోడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పీఏసీఎస్ ఛైర్మన్​తో మాట్లాడి సన్నరకం ధాన్యం కొంటామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:Lockdown: పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేయనున్న ప్రభుత్వ ఆఫీసులు

ABOUT THE AUTHOR

...view details