తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద రైతుల ఆందోళన - farmers protest

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం యూటీ కాల్వకు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టడం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని... నాగర్‌కర్నూలు జిల్లా జంగారెడ్డిపల్లి, తిమ్మరాశిపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద రైతుల ఆందోళన

By

Published : Sep 21, 2019, 6:17 PM IST

నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద జంగారెడ్డిపల్లి, తిమ్మరాశిపల్లి గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. పదిరోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు యూటీ కాల్వకు గండి కొట్టడం వల్ల... కేఎల్‌ఐ కాలువ ఆయకట్టులో సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపించారు. ఈ దుశ్చర్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details