తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

భూప్రక్షాళనలో భాగంగా ఇప్పటికీ తమ భూములు ఆన్​లైన్​లో ఎక్కలేదనో లేక మరో వ్యక్తి పేరున ఎక్కించారనో.. తమ భూమి తమకు చేయాలని కోరుతూ ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతన్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. అధికారుల తప్పిదాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారిపోతున్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కోడేరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

farmer suicide attempt in nagarkarnool district
రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 17, 2020, 2:04 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కోడేరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు. కోడెర్ మండలం రాజపూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య తన తండ్రి పేరున సర్వే నెంబర్ 200, 207, 213లో 2.16 ఎకరాల పొలం ఉంది. తమ భూమిని ఆన్​లైన్​లో ఎక్కించాలని గత సంవత్సరం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతు ఆరోపించారు. 2.16 ఎకరాల భూమికి కేవలం 16 గుంటల భూమిని ఆన్​లైన్​లో ఎక్కించి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం వల్ల కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దీంతో చుట్టుపక్కల ఉన్న రైతులు అడ్డుకొని కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని సమస్యను పరిష్కరించేలా చూస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు.

ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో వ్యవసాయ కోడె మృతి

ABOUT THE AUTHOR

...view details