తెలంగాణ

telangana

ETV Bharat / state

నార్లాపూర్​ ప్రాజెక్ట్​ ఎదుట ఆత్మహత్యయత్నం

ఏళ్లు గడుస్తోన్న ప్రభుత్వం తమకు పరిహారం ఇవ్వడం లేదంటూ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్​ నిర్వాసితులు. నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్న పలు గ్రామాల బాధితులు.. అక్కడ జరుగుతోన్న నిర్మాణ పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. హామీల ప్రకారం 117 కుటుంబాలకు.. 250 గజాల రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్​ చేశారు.

Narlapur Reservoir
Narlapur Reservoir

By

Published : May 17, 2021, 11:52 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్​ నిర్వాసితులు.. ఏళ్లు గడుస్తోన్న ప్రభుత్వం తమకు పరిహారం ఇవ్వడం లేదంటూ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకుని.. నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుల్యా నాయక్, అంజగిరి, సున్నపు తండాలకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం ఇప్పిస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్పి.. నేటికి స్పందించడం లేదని వాపోయారు. హామీల ప్రకారం 117 కుటుంబాలకు.. 250 గజాల రెండు పడకల ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:జాతరను తలపించిన మార్కెట్లు.. పట్టించుకోని అధికారులు

ABOUT THE AUTHOR

...view details