నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 80 కాటన్ల బెల్లం, సారాయిని పట్టుకున్నారు. సారా తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన 100 లీటర్లు బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. మొత్తం ముగ్గురిపై కేసులు నమోదు చేసి ఓ ఆటోని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.
ముక్కిడిగుండంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు.. - నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు
నాగర్ కర్నూల్ జిల్లా ముక్కిడిగుండంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు 80 కాటన్ల బెల్లాన్ని, సారాయిని పట్టుకున్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి ఓ ఆటోని స్వాధీనం చేసుకున్నారు.
![ముక్కిడిగుండంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు.. excise police raids in kollapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8240260-472-8240260-1596171884405.jpg)
ముక్కిడిగుండంలో ఎక్సైజ్ పోలీసుల దాడులు..
మండలంలోని పలు తండాల్లో కూడా సారాయి తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని... అక్కడ కూడా దాడులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వివరించారు. అక్రమంగా సారా తయారు చేసినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడులను నిరంతరం కొనసాగిస్తామని సీఐ ఏడుకొండలు తెలిపారు.