నల్లమల ప్రాంతంలో నాటుసారా తయారీ రోజురోజుకు పెరిగిపోతోంది. నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల తండా, బాణాల తండాలలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. అక్రమంగా అమ్ముతున్న 10 లీటర్ల నాటు సారా, నాటుసారా తయారీ కోసం వినియోగించే 40 కేజీల నల్ల బెల్లం స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
నాటుసారా తయారీ స్థావరాలపై అధికారుల దాడులు - గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని పలు తండాల్లో నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10లీటర్ల నాటుసారా, 40 కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా తయారీ స్థావరాలపై అధికారుల దాడులు
అక్కడ నిల్వ ఉంచిన 350 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నాటుసారాను తయారుచేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నాటుసారా అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ ఎన్ఫోర్సమెంట్ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: సర్పంచ్ భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఏఎన్ఎం ఫిర్యాదు