నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముండే సోమోజు నరేష్ టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నరేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అద్దె ఇంట్లో ఉండే నరేష్.. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా టీ కొట్టు తెరవలేదు. చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది. ప్రస్తుతం పూట గడవని పరిస్థితుల్లో ఉన్నాడు.
ట్విట్టర్ సందేశానికి స్పందించిన మాజీ ఎంపీ కవిత - తెలంగాణ జాగృతి
సాయం కోరుతూ ట్విట్టర్లో పంపిన సందేశానికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కవిత స్పందించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి తక్షణ సాయం చేశారు.
ట్విట్టర్ సందేశానికి స్పందించిన మాజీ ఎంపీ కవిత
ఎవరినైనా చేయి చాచి అడగడానికి ఆత్మగౌరవం అడ్డొచ్చింది. తన పరిస్థితిని ట్విట్టర్ ద్వారా జాగృతి వ్యవస్థాపకురాలు కవితకు చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన కవిత.. నరేష్‌కు సాయం చేయాల్సిందిగా.. స్థానిక జాగృతి నాయకులకు సమాచారం అందించారు. జాగృతి జిల్లా అధ్యక్షురాలు పావని, సత్యం, భారతి తక్షణ సాయంగా నరేష్ కుటుంబానికి నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందించారు.
ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు