ఫోన్ కాల్కు కల్వకుంట్ల కవిత స్పందన.. బాధితులకు సాయం - EX MP K kavitha latest news
లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి తన గోడును తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఫోన్ ద్వారా విన్నవించుకున్నాడు. దీనికి స్పందించిన ఆమె సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

EX MP kavitha help to poor people at nagarkurnool District latest news
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని చౌటపల్లి సమీపంలో సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుక్కల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో పనిచేస్తున్న ఆర్‌కే రాయ్, సత్యమ్మ... సరకులు అయిపోవడం వల్ల తమగోడును కవితకు ఫోన్ ద్వారా విన్నవించారు. స్పందించిన ఆమె అచ్చంపేటలోని తెలంగాణ జాగృతి సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించి సాయం చేయాలని సూచించారు. సంస్థ ప్రతినిధులు గోరటి రామకృష్ణ, చారకొండ సత్యం, భారతి, హైమావతి బాధితులకు 50కిలోల బియ్యం అందజేశారు.