గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి మోదీ హయాంలో జరిగిందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఉద్యోగాలు కల్పించడంలో తెరాస విఫలం : జితేందర్ రెడ్డి - నాగర్ కర్నూల్ భాజపా పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఉద్యోగాలు కల్పించడంలో తెరాస విఫలం : జితేందర్ రెడ్డి
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ కృషి చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయమని ఆయన జోస్యం చెప్పారు.