నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ఐక్యంగా గ్రామాభివృద్ధిలో భాగం కావాలని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పెద్దముద్దునూరులో పారిశుద్ధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యంపై గ్రామసభ నిర్వహించారు. నెల రోజులపాటు పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుందని వివరించారు. గ్రామ యువకులు, పుర ప్రముఖులు పూర్తి సహాయ సహకారాలు అందించి పల్లెల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, జడ్పీటీసీ శ్రీశైలం, డీపీఓ సురేశ్ మోహన్ పాల్గొన్నారు.
'గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి' - sridhar
నాగర్కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరులో 30 రోజుల ప్రత్యేక కార్యచరణలో అధికారులంతా భాగస్వాములు కావాలనిత జిల్లా పాలనాధికారి శ్రీధర్ సూచించారు.
గ్రామాభివృద్ధిలో ఐక్యం కావాలి