నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని వివిధ వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు పౌసమి బసు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతి, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసే విధంగా తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు.
'ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి' - ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన పౌసమి బసు వార్తలు
కల్వకుర్తి పురపాలికలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు పౌసమి బసు పరిశీలించారు. కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
'ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి'
పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, సమస్యలు తలెత్తినా వెంటనే పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, ఎస్సై మహేందర్, మున్సిపల్ కమిషనర్ బాలచంద్ర సృజన్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు