నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు ఒకరోజు శిక్షణ, అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ హాజరయ్యారు. పట్టుదల, క్రమశిక్షణతో శ్రమిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని కలెక్టర్ అన్నారు. పదోతరగతి భవిష్యత్తుకు ముఖ్యమైన మలుపని తెలిపారు. పరీక్షలకు 35 రోజులు గడువు మాత్రమే ఉందని, విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని సూచించారు. లక్ష్యసాధనకు ప్రతి నిమిషం శ్రమించాలన్నారు.
లక్ష్య సాధనకు ప్రతి నిమిషం శ్రమించాలి..
చదువు తపస్సు లాంటిదని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ పదో తరగతి విద్యార్థులకు సూచించారు. బాగా చదివి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని సూచించారు.
లక్ష్య సాధనకు ప్రతి నిమిషం శ్రమించాలి..
పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలంటే భయపడొద్దన్నారు. చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైతే విజయం సాధ్యమన్నారు. తాను కూడా వసతి గృహంలోనే ఉండి ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారులు, ఉపాధ్యాయులు, 60 సంక్షేమ వసతి గృహాల నుంచి 1350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వివేకా హత్యకేసులో ఆయనే సూత్రధారి : బుద్ధా వెంకన్న