Etela Rajender on CM KCR: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ సబ్బండ వర్గాలను వంచించిన సీఎం కేసీఆర్ ఇంటి ముందు చావుడప్పు కొట్టాలని భాజపా నేత ఈటల రాజేందర్ విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, దళితులను మోసం చేసింది ముఖ్యమంత్రి అని ఈటల స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో రెండోరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ శిబిరానికి హాజరైన ఈటల.. తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం దాడులు చేయాలంటున్నారని ఆయన విమర్శించారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే సీఎం కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదని ఈటల రాజేందర్ అన్నారు. ప్రగతిభవన్‌కు ఇనుప కంచె వేసి ఎవరినీ లోపలికి రానివ్వరని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్ దెబ్బతో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటికి వచ్చారని ఈటల అన్నారు.
కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు