నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీ కులానికి చెందిన 30 మంది పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు నాగుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టగా... జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పాల్గొని సరుకులు అందజేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు, పోలీస్ సిబ్బందికి పండ్లను పంచిపెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆచారి తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్, వైద్య సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు.
కల్వకుర్తిలో నిత్యావసరాల పంపిణీ - Nagarkurnool Padmashali sangam food distribution
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులు అందజేశారు.
Breaking News