నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తెరాసనే దక్కించుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. ఇందుకు కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
'అన్నింటా మనమే గెలవాలి' - అన్నింటినీ మనమే గెలుచుకోవాలి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్నింటిని తెరాస హస్తగతం చేసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

అన్నింటినీ మనమే గెలుచుకోవాలి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నీ తమ వశం చేసుకుంటే అభివృద్ధికి వీలుంటుందన్నారు. నాయకులందరూ సమన్వయంతో ఈ ఎన్నికల్లో పాలుపంచుకోవాలన్నారు. రైతులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు చేస్తున్న అభివృద్ధిని వివరించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను గెలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి పాల్గొన్నారు.
అన్నింటినీ మనమే గెలుచుకోవాలి
ఇదీ చూడండి:కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!