తెలంగాణ

telangana

ETV Bharat / state

'చిన్నారులు చదువుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది' - తెలంగాణ వార్తలు

చిన్నారులు చదువుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు విద్యా సంస్థల నూతన భవనాలను ఆమె ప్రారంభించారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

Education Minister Sabita Indrareddy
చిన్నారులు చదువుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది'

By

Published : Jan 31, 2021, 8:01 PM IST

రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి నుంచి ఆపై తరగతులు... కొవిడ్​ నిబంధనల ప్రకారం ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాబోయే పరీక్షలకు విద్యార్థులంతా సమాయత్తం కావాలని కోరారు. చిన్నారులు చదువుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని మంత్రి సబితా అన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు విద్యా సంస్థల నూతన భవనాలను ఆమె ప్రారంభించారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన సొంత నిధులు... రూ.6 లక్షలతో చింతలపల్లి గ్రామంలోని పాఠశాలను రైల్ బండి ఆకారంలో అలంకారం చేశారు. రాష్ట్రంలోని పాఠశాలు కొత్తదనం కోసం దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. అదేవిధంగా కొల్లాపూర్​లో రూ. 5 కోట్లతో నిర్మించిన పీజీ కళాశాల భవనంను, రూ. 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు , ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

అంతకుముందు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు సబితా ఇంద్రారెడ్డి పోలియో చుక్కలు వేశారు. దీంతో పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సర్వం, జడ్పీ ఛైర్​ పర్సన్ పద్మావతమ్మ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఆ హీరోల గురించి సాయి పల్లవి ఏమందంటే..?

ABOUT THE AUTHOR

...view details