నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పశువైద్య కేంద్రాన్ని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అంజిలప్ప సందర్శించారు. డివిజన్ వైద్య అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మధ్యకాలంలో పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోందని... వ్యాధి నివారణ కోసం గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు.
'ముద్ద చర్మ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించండి' - కల్వకుర్తిలో పశువైద్యాధికారి పర్యటన
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పశువైద్య కేంద్రాన్ని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అంజిలప్ప సందర్శించారు. డివిజన్ వైద్య అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
'Educate farmers on psoriasis'
పశువులు ఉండే కొట్టాల్లో నిపుణుల ద్వారా పొగను పెట్టాలని, ఇంట్లో లభించే పసుపు, కొబ్బరి నూనె, కర్పూరం వాడి పశువుల చర్మాలపైన ఉన్నటువంటి పొక్కుల వద్ద నూనెను రాయాలని సూచించారు. త్వరలోనే మండలంలోని వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువుల్లోని చర్మ వ్యాధిని తగ్గించేందుకు మందులు రైతులకు అందజేస్తామని తెలియజేశారు.