తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు - ex mla kishatatareddy

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో పాటు పలువులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని కిష్టారెడ్డికి తుది వీడ్కోలు పలికారు.

Breaking News

By

Published : Aug 18, 2020, 11:07 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కిష్టారెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా... హైదరాబాద్​లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎడ్మ కిష్టారెడ్డి నిరాడంబరతకు నిలువెత్తు రూపమని... ఆయన మరణం జిల్లా ప్రజలకు తీరని లోటని మంత్రి సంతాపం తెలిపారు.

కల్వకుర్తి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం అప్పటి ప్రభుత్వాలను నిలదీశారని తెలిపారు. ఆయన ఏ రాజకీయ పక్షంలో ఉన్నా.... ప్రజల పక్షమే తన తుది ప్రస్థానం అని అనేవారని గుర్తు చేశారు.

అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఆలా వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, చిత్తరంజన్ దాస్​, ఇతర రాజకీయ నేతలు, తెరాస నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details