నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో భూకంపం వచ్చిందన్న ప్రచారంపై ఎన్జీఆర్‌ఐ(నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) శాస్త్రవేత్త నగేశ్ వివరణ ఇచ్చారు. ఉదయం 5 గంటలకు శ్రీశైలం డ్యామ్ దిగువన(Earthquake near srisailam) నల్లమలలో భూకంపం వచ్చినట్లు తెలిపారు. డ్యామ్ వద్ద ఉన్న భూకంప కేంద్రాల్లో తీవ్రత 3.7గా నమోదైనట్లు చెప్పారు.
Earthquake near srisailam: 'నల్లమల అడవుల్లో భూకంపం.. రాతిపొరల్లో ఒత్తిడితోనే.!' - earthquake near srisailam
శ్రీశైలం డ్యామ్ సమీపంలో(Earthquake near srisailam) భూకంపంపై ఎన్జీఆర్‌ఐ(NGRI) శాస్త్రవేత్త నగేశ్ వివరణ ఇచ్చారు. రాతి పొరల్లోని ఒత్తిడి కారణంగా భూకంపం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.
![Earthquake near srisailam: 'నల్లమల అడవుల్లో భూకంపం.. రాతిపొరల్లో ఒత్తిడితోనే.!' earthquake in nallamala forest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12579183-290-12579183-1627301734272.jpg)
నల్లమల అడవుల్లో భూకంపం
శ్రీశైలానికి 35 కి.మీ. దూరంలో.. 7 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించనట్లు నగేశ్ తెలిపారు. భూకంపం కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. రాతి పొరల్లోని ఒత్తిడి కారణంగా భూకంపం వచ్చినట్లుగా భావిస్తున్నామని శాస్త్రవేత్త నగేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'