పంట అమ్ముకునే తరుణంలో.. అకాల వర్షాలు నాగర్ కర్నూల్ జిల్లా రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన గాలివానకు.. ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసి పోయింది.
రైతులను కన్నీరు పెట్టిస్తోన్న అకాల వర్షాలు - immense damage to farmers
నాగర్ కర్నూల్ జిల్లాలో అకాలవర్షం రైతులకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది.
untimely rains
ఉప్పునుంతల మండలం వెల్టూర్లో.. అమ్మడానికి మార్కెట్కు తీసుకు వచ్చిన వరి ధాన్యం పాడైపోయింది. పదర మండలం ఉడిమిళ్ళ, చిట్లంకుంట గ్రామాల్లో వర్ష భీభత్సం వల్ల అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేరుశెనగ రాశులు తడిసి పోయాయి. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలు.. రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇదీ చదవండి:ఆక్సిజన్ అసలు కథ తెలుసా?